Monday, November 18, 2024

అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి

- Advertisement -
- Advertisement -

Highest salaries for Anganwadi workers

 

మహబూబాబాద్: అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్‌వాడీ వర్కర్లకు మూడు సార్ల వేతనాలు పెంచామని, అత్యధిక వేతనాలు ఇస్తున్నా రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. మహబూబాబ్ జిల్లా కేంద్రంలో అంగన్ వాడీ టీచర్లకు మంత్రి సత్యవతి, ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 35,700 అంగన్ వాడి కేంద్రాల్లో 67,411 అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు నేత చీరలు ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కుటుంబాన్ని వదిలిపెట్టి అద్భుత సేవలు అందించడంతో కోవిడ్ వారియర్స్‌గా గుర్తించామని, సిఎం కెసిఆర్ కేంద్రాన్ని అంగన్ వాడీ కోవిడ్ గుర్తించాలని కోరడంతో వారికి 50 లక్షల రూపాయల బీమా అందుతుందని ప్రశంసించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డలకు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బలామృతంతో కూడిన పోషకాహార భోజనాన్ని అందిస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీలను ఆదుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News