- Advertisement -
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపణ
న్యూఢిల్లీ/తిరువనంతపురం : ప్రస్తుతం వివాదంగా సాగుతున్న హిజాబ్ , సంస్థకు సంబంధించిన ఒకరు నిబంధనలు, డ్రెస్‌కోడ్, పాటించాలా? వద్దా అన్న చాయిస్ ఎంచుకునే ప్రశ్న కాదని, ఇదొక కుట్రని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. కర్ణాటకలో దీనిపై సాగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ న్యూఢిల్లీ లోని పాత్రికేయులతో దీన్ని వివాదంగా తీసుకోరాదని, ఇదో కుట్ర అని ఆరోపించారు. ముస్లిం బాలికలు ఎక్కడైనా బాగానే వ్యవహరిస్తారని, అయితే వారికి ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. హిజాబ్‌ను మహిళలు తిరస్కరించే సంఘటనలు ఇస్లాం చరిత్రలో ఉన్నాయని పేర్కొన్న తరువాత ఆయన ఈమేరకు స్పందించారు. ఇందుకు సంబంధించిన ఒక యువతి కథను ఆయన శుక్రవారం ఉదహరించారు కానీ సవివరంగా తెలియచేయలేదు.
- Advertisement -