Monday, December 23, 2024

హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక తీర్పు..

- Advertisement -
- Advertisement -

Hijab not essential religious practice in Islam:Karnataka HC

బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం హిజాబ్ వివాదంపై జస్టిస్​ రీతు రాజ్​ అవస్థి, జస్టిస్​ కృష్ణ దీక్షిత్​, జస్టిస్​ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. స్కూల్ యూనిఫాం నిబంధన అనేది సహేతుకమైన పరిమితి మాత్రమే.. విద్యార్థులు దీనికి అభ్యంతరం తెలపడానికి వీల్లేదని పేర్కొంది. హిజాబ్ ఇస్లాం యొక్క ముఖ్యమైన మతపరమైన ఆచారాలలో భాగం కాదు తెలిపింది. యూనిఫాం అవసరం అనేది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కుపై సహేతుకమైన పరిమితని చెప్పింది. జీవోను ఆమోదించే అధికారం ప్రభుత్వానికి ఉందని, దాని ధృవీకరణ కోసం ఎటువంటి కేసు రూపొందించబడలేదన్న హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు హిజాబ్, కండువాలు, మతపరమైన జెండాలతో తరగతులకు వెళ్ళొద్దని గతంలో కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Hijab not essential religious practice in Islam:Karnataka HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News