Thursday, March 13, 2025

పాక్ ఎక్స్ ప్రెస్ రైలు హైజాక్..35 మంది పాక్ సైనికులు హతం

- Advertisement -
- Advertisement -

పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్ జరిగి 36 గంటలు గడుస్తున్నా.. సమస్య పరిష్కారం కాలేదు. పాక్ జైళ్లలో మగ్గుతున్న బెలూచిస్తాన్ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో తమవద్ద బందీలుగా ఉన్న సైనికులు, ప్రయాణికులపై చర్యకు దిగుతామని వేర్పాటువాద సాయుధ గ్రుప్ బెలోచ్ లిబరేషన్ ఆర్మీ 24 గంటల అల్టిమేటమ్ జారీ చేసింది. ఇప్పటికే,హైజాక్ చేసిన రైలు లోని 35 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బెలూచ్ తీవ్రవాదులు చెబుతున్నారు. మరోపక్క 27 మంది మిలిటెంట్లను చంపివేసి, 155 మంది ప్రయాణికులను రక్షించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. మిగతా వారిని రక్షించేందుకు ట్రైన్ ఉన్న ప్రదేశానికి అదనపు సైనిక బలగాలను తరలించినట్లు చెబుతోంది.బెలూచిస్తాన్ తీవ్రవాద గ్రూప్ బిఎల్ ఏ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును మంగళవారం నాడు కాల్పులు జరిపి రైలుమార్గాన్ని పేల్చివేసి, కాల్పులు జరిపి నిలిపివేశారు. తొమ్మిది బోగీలు ఉన్న 425 మంది ప్రయాణికులతో రైలును హైజాక్ చేశారు. పర్వత ప్రాంతాల గుండా వెళ్తున్న రైలును గుడాలర్ – పిరు కున్రీ స్టేషన్ల మధ్య ముష్కాఫ్ సొరంగ మార్గం వద్ద ఎక్స్ ప్రైస్ హైజాక్ కు గురైంది.

పాక్ జైళ్లలోని బెలూచిస్తాన్ కు చెందిన రాజకీయ ఖైదీలను, కార్యకర్తలను 24 గంటలలోగా విడుదల చేయాలని, లేనిపక్షంలో రైలులో బందీలుగా ఉన్న ప్రయాణికులను ,సైనికులను హతమార్చి, రైలును తగులు పెడతామని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు జారి చేసింది. కాగా, రైలుమార్గం పేల్చివేసిన ప్రదేశంలోనే ఇంకా వందలాదిమంది ప్రయాణికులు మిలిటెంట్ల చేతిలో బందీలుగా ఉన్నారని పాక్ పోలీసు అధికారి రాణా దిలావర్ ప్రకటించారు. జాఫర్ ఎక్స్ ప్రెస్ లో 425 మంది ప్రయాణికులు, 80 మంది సైనిక సిబ్బంది ఉన్నారని, చెబుతుండగా, కేవలం 17 మందిని రక్షించారని, 104 మంది ప్రయాణికులు కాల్పుల్లో గాయపడడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు మరో వర్గం చెబుతోంది.పాకిస్తాన్ ప్రధాని షహ్ బాజ్ షరీఫ్ మిలిటెంట్ల చర్యను ఖండించారు. మిలిటెంట్ల నుంచి ప్రయాణికులను, సైనికులను రక్షించేందుకు పాక్ సైనిక బలగాలు ఎదురుదాడి దిగుతున్నట్లు ప్రకటించారు. క్వెట్టాలో ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించి, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది వెంటనే విధులకు హాజరై గాయపడిన వారికి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News