Wednesday, January 22, 2025

కరాచీలో హైజాకర్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -
Hijacker shooting in Karachi
1999లో భారతీయ విమానం దారిమళ్లింపు

న్యూఢిల్లీ/ కరాచీ: గతంలో భారతీయ విమానం హైజాక్‌కు పాల్పడ్డ వారిలో ఒక్కరైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ నెల 1వ తేదీన ఆయనపై పాకిస్థాన్‌లోని కరాచీలో కాల్పులు జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. 1999 డిసెంబర్‌లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఐసి 814 విమానాన్ని ఇబ్రహీం ఇతరులు దారిమళ్లించారు. అప్పట్లో విమానంలోని ప్రయాణికుడు రూపియన్ కట్యాల్‌ను ఇబ్రహీం కత్తితో పొడిచారు. కరాచీలో ఉంటున్న ఇబ్రహీంను గుర్తు తెలియని వ్యక్తులు దాడి జరిపి హతమార్చినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News