Monday, December 23, 2024

సనత్‌నగర్‌లో 8 ఏళ్ల బాలుడిని హత్య చేసిన హిజ్రా

- Advertisement -
- Advertisement -

సనత్ నగర్ : హైదరాబాద్ లోని సనత్ నగర్ లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా హత్యచేశాడు. తల్లిదండ్రులు ఆరోపించినట్లు నరబలి జరగలేదని పోలీసులు తేల్చారు. బాలుడి హత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని అల్లాదున్ కోఠి ఏరియాలో ఈ ఘటన జరిగింది.

ఇమ్రాన్ అనే హిజ్రా వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు. చిట్టీల డబ్బును ఇమ్రాన్ ఇవ్వకపోవడంతో నిన్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బాలుడు కనిపించకపోవడంతో గురువారం రాత్రి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహం సమీపంలోని నాలాలో గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News