- Advertisement -
వాషింగ్టన్: అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ కొత్త వీసా నేటి నుంచి అమలులోకి రానున్నది. హెచ్-1బి వీసా ఫీజును 2050 శాతం పెంచారు. ఇది అత్యధిక పెంపుదల. హెచ్-1బి కాకుండా ఎల్-1, ఈబి-5 ఫీజులను పెంచుతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అవి కూడా నేటి నుంచే అమలులోకి వస్తున్నాయి. అమెరికా వెళ్లే భారతీయులు చాలా మంది ఈ వీసాలను పొందారు. కొత్తగా పెంచిన నాన్-ఇమ్మిగ్రెంట్ కేటగిరి ఫీజలు ఇలా ఉన్నాయి:
వీసా పాత ఫీజు(డాలర్లలో) కొత్త ఫీజు(డాలర్లలో)
హెచ్-1బి 10 215
ఎల్-1 460 1385
ఈబి-5 3675 11160
నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల పెంపుదల 2016 నుంచి ఇదే మొదలు.
- Advertisement -