Monday, December 23, 2024

హిమాచల్ బిజెపి అధ్యక్షుడి రాజీనామా..ఆసుపత్రిలో చేరిక

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సురేష్ కాశ్యప్ తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు సమర్పించారు. త్వరలోనే కాశ్యప్ పదవీకాలం పూర్తి కానున్నది. వ్యక్తిగత కారణాల దృష్టా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాశ్యప్ తన రాజీనామా లేఖలో తెలిపారు. రాజీనామా సమర్పించిన కొద్ది గంటల్లోనే సుగర్ లెవల్స్ పడిపోయి కాశ్యప్ ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది.

Also Read: ఎన్‌సిపి చీఫ్ పవార్ నివాసానికి అదానీ..

మే 2వ తేదీన సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ కాశ్యప్ తన బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. కాగా..హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తి నియామకం జరిగేవరకు కాశ్యప్ తన పదవిలో కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా బిజెపి అధ్యక్షుల నియామకం జరగవలసి ఉన్నందున ఈ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
రాజీవ్ బిందాల్ రాజీనామా దరిమిలా 2020 మే 22న హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షునిగా నిమయితులైన కాశ్యప్ పదవీకాలం యావత్తు సంక్లిష్టంగా గడిచింది. 2021 నవంబర్‌లో మండి లోక్‌సభ స్థానంతోపాటు అర్కి, ఫతేపూర్, జుబల్ కోట్‌కాయ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలైంది. 2022 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్టీ పరాజయం చెందింది.

పచ్చడ్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాశ్యప్ 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పార్టీని త్వరలోనే బిజెపి పునర్వవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్న పేర్లలో ఉనా ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ సత్తి, మాజీ స్పీకర్, సులాహ్ ఎమ్మెల్యే విపిన్ పార్మర్, నైనా దేవి, ఎమ్మెల్యే రణధీర్ శర్మ, మీజా ఎమ్మెల్యే రాజీవ్ బిందాల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు సికందర్ కుమార్, ఇందు గోస్వామి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News