హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్ జిల్లాకు చెందిన పర్వానూ టింబర్ ట్రెయిల్ వద్ద ఒక కేబుల్ కార్ నిలిచిపోవడంతో 11 మంది యాత్రికులను కిందకు దించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాంకేతర కారణాల వల్ల కేబుల్ కార్ నిలిచిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అందులోనే చిక్కుకుపోయారని, మూడు గంటలు శ్రమించిన తర్వాత వీరిలో 9 మందిని రక్షించి కిందకు తీసుకువచ్చామని డిఎస్‌పి ప్రణయ్ చౌబన్ తెలిపారు.
మరో ఇద్దరిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. తామంతా ఢిల్లీకి చెందిన పర్యాటకులమని ఒక ప్రయాణికుడు తెలిపారు. కల్కా-సిమ్లా హైవేపైన రోప్‌వేలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సాంకేతిక సమస్య తలెత్తి కేబుల్ కార్ ఆగిపోయినట్లు ఆయన చెప్పారు. మరో కేబుల్ కార్ ట్రాలీ ద్వారా ఒకరి తర్వాత మరో ప్రయాణికుడిని కిందకు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా సంఘటన స్థలికి చేరుకుంది.
#WATCH | Himachal Pradesh: Rescue operation underway at Parwanoo Timber Trail where a cable car trolly with tourists is stuck mid-air. pic.twitter.com/VWR13M8wLV
— ANI (@ANI) June 20, 2022