Wednesday, January 22, 2025

హిమాచల్ సిఎం సుఖ్వీందర్‌కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన్ను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం అని తెలిపారు. షిమ్లాలో సిఎంను పరీక్షించిన వైద్యబృందం కూడా ఆయన వెంట వెళ్లింది. బుధవారం రాత్రి సుఖ్వీందర్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News