Monday, December 23, 2024

హిమాచల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్‌మహాజన్ బీజేపీలో చేరిక

- Advertisement -
- Advertisement -

Himachal Congress working president Harshmahajan joins BJP

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్‌మహాజన్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదని, రాష్ట్రంలో సరైన నాయకుడే లేడని, మహాజన్ విమర్శించారు. హర్ష్‌మహాజన్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ సిఎం వీరభద్రసింగ్‌కు ప్రధాన అనుచరుడు కూడా. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరిన హర్ష్‌మహాజన్ ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశ మయ్యారు. పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News