Wednesday, December 25, 2024

ప్రాణాలతో బయటపడిన పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్

- Advertisement -
- Advertisement -

కాఠ్మండు: ప్రముఖ భారతీయ పర్వతారోహకురాలు బల్జీత్‌కౌర్ క్షేమంగా ఉన్నారని అధికారులు మంగళవారం తెలిపారు. సోమవారం కౌర్ మౌంట్ అన్నపూర్ణ సమీపంలో గల్లంతయ్యారు. శిఖరం నుంచి కిందికివచ్చే క్రమంలో ఆమె మంచులో చిక్కుకుపోయారు. దీంతో కౌర్‌ను వెతికేందుకు అధికారులు ఏరియల్ సెర్చ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రపంచంలోని పదవ ఉన్నత పర్వత శిఖరం అన్నపూర్ణను కౌర్ ఆక్సిజన్ లేకుండానే సోమవారం అధిరోహించారు. ఈ విషయాన్ని షెర్పా టైమ్స్ పత్రికకు తెలిపారు.

పర్వత శిఖరానికి చేరుకుని అనంతరం కిందికి వచ్చేక్రమంలో ఆమె మాయమవడంతో రక్షిత చర్యలు చేపట్టామన్నారు. ఏరియల్ సెర్చ్ టీమ్ క్యాంప్ 4వైపు ఒంటరిగా వస్తున్న కౌర్‌ను గుర్తించింది. రెస్కూ ్య సిబ్బంది ఆమెను సురక్షితంగా క్యాంప్‌కు తరలించారని అధికారులు తెలిపారు. కాగా చెందిన అనురాగ్ మౌంట్ అన్నపూర్ణ నుంచి 6వేల మీటర్ల ఎత్తునుంచి పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరునాడు కౌర్ గల్లంతవడంతో కలకలం రేగింది. ప్రస్తుతం బల్జీత్‌కౌర్ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే పర్వతం ప్రపంచంలో ఎత్తయిన పదవ పర్వతంగా గుర్తింపు పొందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News