న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో 1985 తర్వాత ఏ పార్టీ కూడా వరుసగా మరోసారి గెలవలేదు. దాంతో ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీలకు తమ బలాలు, బలహీనతలు ఉన్నాయి. బిజెపి నాయకుడు జెపి నడ్డా ఈ రాష్ట్రానికి చెందిన వాడవ్వడం ఓ ప్లస్ పాయింట్. ఇక సిఎం జైరామ్ ఠాకుర్ వివాదాలకు దూరంగా ఉన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రొగ్రాం విజయవంతం కావడంతో టూరిజం వేగంగా పుంజుకుంది. ఇక బిజెపికి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత(యాంటీఇన్‌కంబెన్సీ) ఉంది. కేంద్రం వ్యతిరేకిస్తున్నప్పటికీ పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని అక్కడి వారు కోరుకుంటున్నారు. బిజెపికి పెద్ద నాయకుల మద్దతు బాగా ఉంది. కాకపోతే ఫ్యాక్షనిజం కూడా ఉంది.
కాంగ్రెస్ విషయానికి వస్తే గత ఏడాది నవంబర్‌లో లోక్‌సభ సీటుతో పాటు నాలుగు ఉప ఎన్నికలలో(అన్నీ) కూడా గెలుపొంది ఉత్సాహంగా ఉంది. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తానని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని, మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తానని వాగ్ధానం చేస్తోంది. దివంగత నేత వీరభద్ర సింగ్ చరిత్రను ఊతంగా చేసుకుంటోంది. ఆయన గత ఏడాది పరమపదించారు. పార్టీలో డివిజన్లు ఓ మైనస్ పాయింట్‌గా ఉంది. వెటరన్ నాయకుడు హర్స్ మహాజన్ బిజెపిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ లోటు కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. బిజెపికి ఉన్నట్లు బడా నాయకులు కాంగ్రెస్‌కు కరువయ్యారు. ఇప్పుడు ఆప్ కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో కాలునాలని చూస్తోంది. దాంతో త్రికోణ పోటీ తప్పదేమోననిపిస్తోంది. పొరుగున ఉన్న పంజాబ్‌లో గెలిచిన ఆప్ ఇప్పుడు హిమాచల్‌లో కూడా తన సత్తా చాటాలనుకుంటోంది. రూ. 3000 నిరుద్యోగ భృతిని ఇస్తానని వాగ్దానం చేస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ లో ముక్కోణపు పోటీయేనా?
- Advertisement -
- Advertisement -
- Advertisement -