Sunday, January 19, 2025

బలవంత మత మార్పిడికి పదేళ్లు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Himachal Pradesh approved Religious Freedom Amendment Bill

మతస్వేచ్ఛ (సవరణ ) బిల్లుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మతస్వేచ్ఛ (సవరణ) బిల్లు 2022 కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో సామూహిక మార్పిడిని నిషేధించింది. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకేసారి మతం మారుచకుంటున్నట్టు , ఇలా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే సుమారు ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వం లోని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. 2019 చట్టంలో సామూహిక మత మార్పిడిని అరికట్టడానికి ఎలాంటి నిబంధన లేదని అందువల్లే ఈ చట్టాన్ని సవరించి రూపొందించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2019 మతస్వేచ్ఛ చట్టం సుమారు 15 నెలల తరువాత 2020 డిసెంబర్ 21న ఆమోదం పొందిందని, అయితే అది తక్కువ శిక్షలను సూచిస్తోందని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News