సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్ బిజెపి చీఫ్ సురేశ్ కశ్యప్ తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమర్పించారని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. బిజెపి కార్యకర్తల కథనం ప్రకారం కశ్యప్ తన రాజీనామాకు ‘వ్యక్తిగత కారణాలు’ పేర్కొన్నారని తెలుస్తోంది.
సురేశ్ కశ్యప్‌ను హిమాచల్‌ప్రదేశ్ బిజెపి చీఫ్‌గా 2020 జులై 22న అపాయింట్ చేశారు. రాజీవ్ బిందాల్ రాజీనామా తర్వాత ఆయన్ని నియమించారు. ఉప ఎన్నికల్లో బిజెపి అర్కిలోని మండి లోక్‌సభ సీటును కోల్పోయింది. 2021 నవంబర్‌లో ఫతేపూర్, జుబ్బల్‌కొట్‌ఖాయ్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. 2022 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది.
రెండుసార్లు పచ్చడ్ నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైన కశ్యప్ 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపి వ్యవస్థగత స్ట్రక్చర్‌లో పునర్వవస్థీకరణ తేవాలనుకుంటోంది.