Monday, December 23, 2024

సుఖ్‌విందర్ సింగ్ సుఖు క్యాబినేట్ లో ఏడుగురు కొత్త మంత్రులు

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్: ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నెల తర్వాత, ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఆదివారం ఏడుగురు ఎంఎల్ఎలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. దీంతో పాటు ఆరుగురు ఎంఎల్ఎలను ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేల్కర్ మంత్రులతో ప్రమాణం చేయించారు.

మంత్రులుగా చేరిన ఎంఎల్ఎలు కల్నల్ (రిటైర్డ్) ధని రామ్ షాండిల్ (సోలన్), చందర్ కుమార్ (కంగ్రా), హర్షవర్ధన్ చౌహాన్ (షిల్లై), జగత్ సింగ్ నేగి (కిన్నౌర్), రోహిత్ ఠాకూర్ (జుబ్బల్-కోట్‌ఖాయ్), అనిరుధ్ సింగ్ (కసుంప్తి) మరియు విక్రమాదిత్య సింగ్ (సిమ్లా-రూరల్). మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సిపిఎస్)లుగా ఎంపికైన ఆరుగురు ఎంఎల్ఎలతో ముఖ్యమంత్రి ప్రమాణం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News