Sunday, December 22, 2024

పేషెంట్ కోసం ఏకంగా హెలికాప్టర్‌ని పంపిన సిఎం..

- Advertisement -
- Advertisement -

సిమ్లా: ఒక మారుమూల ప్రాంతంలోని రోగి కోసం ఏకంగా తన ప్రత్యేక హెలికాప్టర్‌ని పంపి తన విశాల హృదయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చాటుకున్నారు. ముఖ్యమంత్రి తన పర్యటన కూడా రద్దు చేసుకుని మరీ హెలికాప్టర్‌ని పంపారు.

చంబా జిల్లా పాంగి సబ్ డివిజన్ లో కిల్లార్ లో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. అతను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించడం కోసం ఆ ప్రాంతానికి హెలికాప్టర్‌ను పంపారు. అతనిని తండా వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News