- Advertisement -
హిమాచల్: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ రెండు రోజుల నుంచి జ్వరం ఉండటంతో ఆయన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సుఖ్విందర్ సూచించారు. 2022 ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాలుగొవసారి ఎంఎల్ఎ గా ఎన్ని గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ ఆయనను 2022 డిసెంబరు 10న ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించింది. సుఖ్విందర్ సింగ్ సుఖు 2022 డిసెంబరు 11న సిమ్లాలోని చారిత్రక రిడ్జ్ గ్రౌండ్‌లో హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
- Advertisement -