హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని సుఖ్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొనడంతో సిఎం పదవికి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్పందిస్తూ.. తాను సిఎం పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేశారని.. అది పూర్తి అవాస్తవమని సిఎం సుఖ్వీందర్ సింగ్ వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ బలాన్ని నిరూపించుకుంటమని చెప్పారు. తానను యోధుడినని.. ఐదేళ్ల పూర్తి కాలం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని.. కానీ, వారు అనుకున్నదేమీ జరగదని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 27వ తేేదీ మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బిజెపి అభ్యర్థికి ఓటు వేసిన క్రమంలో హిమాచల్ లో రాజకీయం వేడెక్కింది.