- Advertisement -
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం అతలాకుతలమైంది రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందమంది వరకు మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌సుఖు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. వర్షాల తరువాత కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిందని చెప్పారు. 202223 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విపత్తు నిధులు రూ. 315 కోట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశామన్నారు.
- Advertisement -