Monday, December 23, 2024

న్యూ ఈక్విటీ క్యాంపెయిన్ ప్రారంభించిన హిమాలయా కంపెనీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియా యొక్క అగ్రగామి వెల్‌నెస్ బ్రాండ్లలో ఒకటైన హిమాలయా వెల్‌నెస్ కంపెనీ, అన్ని వయసులలోని వినియోగదారులకు ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల ప్రాధాన్యతనిచ్చేలా స్ఫూర్తిని కలిగించే ఒక కొత్త ఈక్విటీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ హిమాలయా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయిన “ప్రతి ఇంట్లోనూ శ్రేయస్సు, ప్రతి హృదయంలోనూ సంతోషం”కు జీవం తెస్తుంది.

గడచిన తొమ్మిది దశాబ్దాల పాటుగా, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు హత్తుకొనే విధంగా ఆరోగ్యం మరియు శ్రేయస్సులో హిమాలయా అగ్రగామిగా వెలుగొందుతోంది. మనమందరమూ గనక ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే ప్రపంచం సంతోషదాయకమైన చోటుగా ఉంటుందని హిమాలయా విశ్వసిస్తుంది. మంచి ఆరోగ్యం మరియు బాగుండడం కోసం మన జీవనశైలిలో మార్పు మరియు నివారక ఆరోగ్య సంరక్షణ పట్ల ధ్యాసను ఆకర్షించేలా ఈ కొత్త క్యాంపెయిన్ లక్ష్యంగా చేసుకుంటుంది.

హిమాలయా వెల్‌నెస్ కంపెనీ వినియోగదారు ఉత్పత్తుల విభాగం బిజినెస్ డైరెక్టర్ శ్రీ రాజేష్ క్రిష్ణమూర్తి గారు క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ, “హిమాలయా వద్ద మేము, క్షేమంగా ఉండడమే నిజమైన సంతోషం అని విశ్వసిస్తాము. ఈ బ్రాండు చిత్రం, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించడం కోసం వెల్‌నెస్ (శ్రేయస్సు) యొక్క పాత్రపై అవగాహన కల్పించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. ప్రతి ఇంట్లోనూ శ్రేయస్సు, ప్రతి హృదయంలోనూ సంతోషం అనే మా ముఖ్య ఉద్దేశ్యాన్ని బలపరచేలా తల-నుండి-పాదాల వరకు అత్యుత్తమ శ్రేణి వినియోగదారు ఉత్పత్తులకు హిమాలయా మార్గదర్శకత్వం వహించింది మరియు అభివృద్ధి చేసింది” అన్నారు.

ఎం. దామోదరన్ నాయర్, ప్రెసిడెంట్ & హెడ్ ఆఫ్ ఆఫీస్ (ఎఫ్.సి.బి బెంగళూరు): గత రెండు సంవత్సరాల పాటుగా, మేమందరమూ ఏదో ఒక రూపములో ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తూనే ఉన్నాము. 90 సంవత్సరాల పాటు శ్రేయస్సుకు మార్గదర్శకత్వం వహించి మరియు తన వారసత్వాన్ని నిర్మించినట్టి హిమాలయా వంటి బ్రాండుకు మన దైనందిన జీవితాలలో శ్రేయస్సు యొక్క పాత్రను పునరుద్ఘాటించడానికి అది సరియైన సమయముగా ఉండినది. ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ అనే పాత సామెత ఎంతవరకూ నిజం అయిందో కానీ, హిమాలయా మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, ‘శ్రేయస్సు అనేది నిజమైన సంతోషం’ అని చెప్పగలుతోంది.

రోమిత్ నాయర్, ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ హెడ్ (ఎఫ్.సి.బి బెంగళూరు): చురుకైన జీవనశైలి పట్ల ఉన్న డిమాండ్లతో, తమ సంతోషం మరియు శ్రేయస్సు కోసం నివారక ఆరోగ్య సంరక్షణను అలవరచుకోవాల్సిన ప్రాముఖ్యతను వినియోగదారులు గ్రహించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితములో ఏదో ఒక సమయములో ‘కాష్’ (అంతే కదా) అని ఉంటారు, వాళ్ళు గ్రహించినప్పుడు, ఈ క్లిష్టమైన పరిస్థితిని నివారించడానికి ఏమైనా చేసి ఉంటే బాగుండేది కదా అనుకుంటారు. హిమాలయా ఈక్విటీ క్యాంపెయిన్ ఈ వినియోగదారు గ్రాహ్యతపై ఆధారపడింది.

ఫిలిం‌ ఇక్కడ చూడండి: https://www.youtube.com/watch?v=UZYLIwpYWCs

Himalaya launches new Equity Campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News