Wednesday, January 22, 2025

హిమాలయాలకు సాయం అవసరం..

- Advertisement -
- Advertisement -

దుబాయి: హిమనదాలు ప్రమాదస్థాయిలో కరిగిపోతుండడంతో హిమాలయ పర్వతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ ప్రస్తుతం జరుగుతున్న వార్షిక వాతావరణ చర్చలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా పర్వత దేశాల తక్షణ అవసరాలకు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. హిమాలయాల్లోని హిమనదాలు, అక్కడ పుట్టే సింధూనది, గంగ, బ్రహ్మపుత్ర లాంటి పది ప్రధాన నదులపై దాదాపు 24 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. ఈ నదీ ప్రరీవాహక ప్రాంతంలోని భారత్ సహా ఎనిమిది దేశాల్లోని మరో వంద కోట్ల మంది హిమనదాల్లో పుట్టి ప్రవహించే నదులపై ఆధారపడి జీవిస్తున్నారు. దుబాయిలో ఇక్కడ జరుగుతున్న వాతావరణ సదస్సు( కాప్28)లో భాగంగా శనివారం పర్వతప్రాంత దేశాల సమావేశంలో గుటెరస్ మాట్లాడుతూ నేపాల్‌లోని పర్వతాల్లోని మంచులో మూడో వంతు కేవలం 30 సంవత్సరాల వ్యవధిలో కరిగిపోయిందని, భూగోళం వేడెక్కడానికి కారణమైన కర్బన ఉద్గారాలే దీనికి ప్రధాన కారణమని చెప్పారు.

వెనుకబడిన దేశాలకు అందజేస్తామని ఇచ్చిన 100 బిలియన్ డాలర్ల సహాయంపై స్పష్టత ఇవ్వాలని, అలాగే దత్తత ప్రణాళిక ఆర్థిక సాయాన్ని 2025 నాటికి 40 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని అభివృద్ధి చెందిన దేశాలకు గుటెరస్ విజ్ఞప్తి చేశారు.అయితే జరుగుతున్న నష్టం తీవ్రతతో పోలిస్తే ఈ మొత్తాలు చాలా తక్కువ అని గుటెరస్ అంటూ నేపాల్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను మరితం మెరుగ్గా తీర్చడానికి వీలుగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకులను సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్పు రాని పక్షంలో పెను ప్రమాదం ముంచుకు రానుందని ఆయన హెచ్చరించారు. గత అక్టోబర్ చివరి వారంలో గుటెరస్ ఎవరెస్టు ప్రాంతంతో పాటుగా నేపాల్‌లో పర్యటించి అక్డి పరిస్థితలును స్వయంగా అర్థం చేసుకున్నారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండతో పాటుగా పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News