- Advertisement -
హైదరాబాద్ : తాను సిఎఎస్ అధ్యక్షునిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కేశవ్‌నగర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునరుద్ధరించినట్లు సిఎం కెసిఆర్ మనవడు కెటిఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనిని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూలై 12న ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.ఈ ప్రాజెక్ట్ వెనుక కథను త్వరలో పంచుకుంటాను అంటూ హిమాన్షు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
- Advertisement -