గువాహటి : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రగడను సృష్టించాయి. భారత్‌లో మైనార్టీల దుర్బలతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఒబామాను అరెస్టు చేసేందుకు అస్సాం పోలీస్‌లు వాషింగ్టన్ వెళ్తారా అంటూ ట్విటర్‌లో వచ్చిన ఒక ప్రశ్నకు “ భారత్‌లో అనేక మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు. వారిని ఎదుర్కోవడమే నా మొదటి ప్రాధాన్యం ” అని బిశ్వకర్మ బదులిచ్చారు. వాషింగ్టన్‌కు వెళ్లడానికి ముందు దీనిపై పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అస్సాం పోలీస్ విభాగం స్వీయ ప్రాధామ్యాల ప్రకారం నడుచుకుంటుందని తెలిపారు.
దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన విపక్ష నేతలపై అస్సాం పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒక పాత్రికేయుడు ట్విటర్‌లో ఆ ప్రశ్నను సంధించారు. ఒబామాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా ? అని ఆయన అడిగారు. మరోవైపు అస్సాం సిఎం వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో మండిపడ్డారు. భారత్‌లో మతం ఆధారంగా వివక్ష లేదంటూ అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఇవి ఉల్లంఘించినట్టవుతుందని పేర్కొన్నారు. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని, అప్పుడే ప్రపంచం విశ్వసిస్తుందని తెలిపారు.
Also Read: నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ముగ్గురు బలి