గువాహటి: కొవిడ్19 మొదటి వేవ్ కాలంలో జాతీయ హెల్త్ మిషన్‌కు మారెట్ రేట్ల కన్నా అధిక ధరలకు పిపిఇ కిట్లను సరఫరా చేసి తాను అవినీతికి పాల్పడినట్లు నిరాధార ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ క్రిమినల్ డిఫమేషన్(పరువునష్టం) కేసు దాఖలు చేశారు. కామరూప్ రూరల్‌లోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం ఈ కేసు నమోదు అయింది. జులై 22న ఫిర్యాదుదారు కోర్టు ఎదుట ప్రాథమికంగా హాజరుకావలసి ఉంటుంది. హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయన్ శర్మకు చెందిన జెసిబి ఇండస్ట్రీస్ అస్సాంలోని జాతీయ హెల్త్ మిషన్‌కు కొవిడ్19 మొదటి వేవ్‌లో పిపిఇ కిట్లను మార్కెట్ రేట్ల కన్నా ఎక్కువ ధరలకు సరఫరా చేసినట్లు మనీష్ సిసోడియా జూన్ 4న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరాధారంగా హిమంత తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా ఖండించారు. నిజానికి జెసిబి ఇండస్ట్రీస్ పిపిఇ కిట్లను విరాళంగా ఇచ్చిందని ఆయన వివరించారు.
సిసోడియాపై హిమంత బిశ్వ పరువునష్టం కేసు
- Advertisement -
- Advertisement -
- Advertisement -