Sunday, January 26, 2025

సాక్షాలు చూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా: హిమంత బిశ్వ శర్మ

- Advertisement -
- Advertisement -

గౌహతి: తన భార్య రింకి భుయాన్ శర్మ కానీ, ఆమెకు సంబంధించిన కంపెనీకి కానీ కేంద్రంనుంచి ఎలాంటి సబ్సిడీ అందలేదని అసోం ముఖంయమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం పునరుద్ఘాటించారు. తన భార్య కానీ, ఆమెకు సంబంధించిన కంపెనీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్ అందుకున్నట్లు ఎలాంటి సాక్షం ఉన్నా రాజకీయాలనుంచి రిటైర్ కావడంతో సహా ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. ‘ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా నా భార్యకు కానీ, ఆమెకు సంబంధించిన కంపెనీకి కానీ కేంద్రంనుంచి ఎలాంటి సబ్సిడీ అందలేదని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. దీనికి సంబంధించి ఎరైనా సాక్షం అందజేస్తే ప్రజా జీవితంనుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో సహా ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా’ అని హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టులో స్పష్టం చేశారు.

ఈ సబ్సిడీకి సంబంధించి తొలుత కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ బుధవారం సోషల్ మీడియాలో ఈ సబ్సిడీకి సంబంధించి అనుమానాలు లేవనెత్తడంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర పథకమైన ‘ పిఎం కిసాన్ సంపద యోజన’ పథకం కింద హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ ప్రైడ్ ఈస్ట్ ఎం ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూ.10 కోట్ల సబ్సిడీతో కూడిన రుణం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ఆహార వాఖకు చెందిన వెబ్‌సైట్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం వెలువడింది. దీంతో ఈ వ్యవహారం అసోంలో తీవ్ర రాజకీయ సంచలనం రేపుతోంది.‘ నిన్న రోజంతా హిమంత బిశ్వశర్మ తన భార్యకు సంబంధించిన కంపెనీకి చెందిన సమాచారం కోసం ఆన్‌లైన్‌లో వెదికారు. ఆయన సదుపాయం కోసం నేను పార్లమెంటులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ఇచ్చిన సమాధానాన్ని పేర్కొంటున్నాను. ఇద్దరు మంత్రులు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News