Friday, December 27, 2024

ఒక్కొక్కటి బయటపెడుతున్న హిండెన్ బర్గ్ రీసెర్చ్

- Advertisement -
- Advertisement -

ముంబై: అదానీ గ్రూపులో సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవర్ బచ్ లకు వాటాలున్నాయని అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. హిండెన్ బర్గ్ నిరాధార ఆరోపణలు చేస్తోందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి అన్నారు. కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడానికే హిండెన్ బర్గ్ రీసెర్చ్ దురుద్దేశపూరిత ఆరోపణలు చేస్తోందని అదానీ గ్రూప్ తెలిపింది.

హిండెన్ బర్గ్ శనివారం ‘సమ్ థింగ్  బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది. కాగా ఇప్పుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని దేశాంతర బెర్ముడా, మారిషస్ ఫండ్ లు ఉన్నాయనీ, వాటిలో మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ. 83 కోట్లు ఉంటుందని పేర్కొంది.

బ్లాక్ స్టోన్ ధావల్ బచ్ పాత్రపై త్వరలో నిజాలు వెల్లడి కాగలవని హిండెన్ బర్గ్ రీసెర్చ్ తెలిపింది. బ్లాక్ స్టోన్ లో ధావల్ బచ్ కు సలహాదారుడి పొజిషన్ ఉంది. రియల్ ఎస్టేసట్స్ ఇన్వెస్ట్ మెంట్స్ ట్రస్ట్ స్ రంగంలో బ్లాక్ స్టోన్ గణనీయ  పాత్ర పోషిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News