Thursday, January 23, 2025

మేమే కమిటీ వేస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీహిండెన్‌బర్గ్ ఱవాదం విషయంలో కేంద్రం సమర్పించిన సీల్డ్ కవర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.సీల్డ్ కవర్‌లో కేంద్రం ఇచ్చిన సూచనలను ఒప్పుకోబోమని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అ త్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణ పూర్తి పారదర్శకతతో ఉండాలని కోరుకొంటున్నట్లు చెప్పింది. ఈ వ్యవహారంలో తామే ఒక కమిటీని నియమిస్తామని అంటూ తీర్పు ను రిజర్వ్ చేసింది. అదానీహిండెన్‌బర్గ్ వ్యవహారంపై సీనియర్ న్యాయవాదులు  ప్రశాంత్ భూషణ్, శర్మ సహా పలువురు ప్రజాప్రయోజన పిటిషను ్ల(పిల్స్) దాఖలు చేశారు. ఈ పిల్స్‌పై శుక్రవారం సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్ధీవాలలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ నెల 13న తొలిసారి విచారణ చేపట్టగా… తాము దర్యాప్తు జరపాలని కోరుకొంటున్నట్లు కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. ఈ వ్యవహారంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి.. తద్వారా విచారణ జరిపించాలని కోరుకొంటున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం సీల్డ్ కవర్‌లో నిపుణుల కమిటీ సభ్యుల పేర్లు, విధి విధానాలతో కూడిన ఓ నివేదికను కోర్టుకు అందించారు. కేంద్రం సమర్పించిన సీల్డ్‌కవర్‌ను తాజాగా పరిశీలించిన ధర్మాసనం..ప్రభుత్వం నివేదికను అంగీకరించడం లేదని స్పష్టం చేసింది.

అదానీ గ్రూపు షేర్ల పతనానికి దారి తీసిన హిండెన్‌బర్గ్ నివేదికను పరిశీలించి డిపాజిట్‌దారులకు నష్టం కలిగించకుండా తగు సూచనలు చేసేందుకు తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీలో చేర్చడానికి కేంద్రప్రభుత్వం సీల్డ్‌కవర్‌లో సూచించిన పేర్లను కానీ, పిటిషనర్లు సూచించిన పేర్లను కానీ అంగీకరించబోమని బెంచ్ తేల్చి చెప్పింది. పారదర్శకతతో విచారణ జరగాల్సి ఉన్నందున తామే నిపుణులను ఎంపిక చేసి కమిటీని నియమిస్తామని సిజెఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వ కమిటీకి సమానమవుతుందని, కమిటీపై ప్రజల్లో విశ్వాసం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సిట్టింగ్ జడ్జిలు కమిటీలో ఉండబోరని సిజెఐ అంటూ ప్రతి రోజూ బెంచ్‌లను ఏర్పాటు చేయడంలో తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వీలయినంత త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News