Wednesday, January 22, 2025

అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక.. విచారణ కోసం సెబీకి 3నెలల గడువు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీకి సంబంధించిన హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు చేపట్టిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) ఆగస్టు 14న తన విచారణ నివేదికను అందజేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ , జెబి పార్థివాలాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి అదానీ గ్రూపుపై దర్యాప్తు కోసం సెబీ ఆరునెలలు గడువు కోరింది. సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వవచ్చని, కానీ ఆగస్టు 14న మీ స్టేటస్ ఏమిటో ఆ నివేదికలో వెల్లడించాలని కోర్టు సూచించింది. నిపుణుల కమిటీ దీనిపై రిపోర్టు ఇచ్చిందని, కానీ సమ్మర్‌బ్రేక్ తర్వాత దాన్ని విశ్లేషించనున్నట్టు కోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News