Wednesday, January 22, 2025

అదానీ స్పందనకు హిండెన్‌బర్గ్ ప్రతిస్పందన!

- Advertisement -
- Advertisement -

‘మోసం మోసమే’ అంది !!

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీలు షేర్లలో అవకతవకలపై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇటీవల భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. అయితే హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. భారత్ సాధిస్తున్న ప్రగతిపై అక్కసుతోనే అసత్య ప్రచారం చేస్తోందని వాదించింది. అయితే జాతీయవాదం పేరిట మోసాన్ని దాచిపెట్టలేరని జవాబిచ్చింది.

అదానీ గ్రూప్ షేర్ల అవకతవకలకు, ఖాతాల్లో అక్రమాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ నివేదిన పేర్కొంది. కాగా అదానీ గ్రూప్ ఆదివారం 413 పేజీల్లో తన స్పందన తెలిపింది. ‘భారత్‌పై ఉద్దేశపూర్వక దాడి’ అని విరుచుకుపడింది. దీనికి హిండెన్‌బర్గ్ ‘అదానీ గ్రూప్ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోంది. జాతీయవాదాన్ని లేవనెత్తుతోంది. నివేదికను భారత్‌పై ఉద్దేశపూర్వక దాడి అని పేర్కొంటోంది. అసత్యప్రచారం చేస్తోంది. దీన్ని మేము అంగీకరించబోము. జాతీయవాద ముసుగులో దేశాన్ని ఓ క్రమపద్ధతిలో అదానీ గ్రూప్ దోచుకుంటోంది. అది భారత్ భవిష్యత్తుకే అడ్డంకి కాగలదని మేము నమ్ముతున్నాం. జాతీయవాదం పేరిట మోసాన్ని దాచలేరు’ అని హిండెన్‌బర్గ్ తెలిపింది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకే అదానీ గ్రూప్ జవాబిచ్చిందని తెలిపింది.

‘గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ తన విదేశీ డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్ అనుమానస్పద లావాదేవీలు జరుపుతోందని మేము మా నివేదికలో పేర్కొన్నాం. షేర్లలో అవకతవకలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతోందని సాక్షాలతో బయటపెట్టాం. వినోద్ అదానీ కంపెనీలకు బిలియన్ డాలర్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించాం. కానీ వాటికి అదానీ గ్రూప్ సరిగా జవాబుచెప్పలేదు. పైగా వినోద్ అదానీకి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేని కారణంగా ఈ కంపెనీల విషయాలను వెల్లడించలేమంటూ దాటేసింది. అంతేకాక వినోద్ అదానీ కంపెనీ నిధుల నుంచి తమకు ఎలాంటి విషయం తెలియదని తప్పించుకుంది’ అని హిండెన్‌బర్గ్ వివరణ ఇచ్చింది.

Hindenburg reply

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News