Wednesday, January 22, 2025

హిండన్‌బర్గ్ రిసెర్చ్ తదుపరి టార్గెట్ ఎవరు?

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అదానీ గ్రూపు కంపెనీల అక్రమాలపై నివేదికను ప్రచురించిన తర్వాత అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మరో భారీ నివేదికను విడుదల చేయనున్నది. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన అనంతరం అదానీ గ్రూపు కంపెనీలు భారీ స్థాయిలో నష్టాలపాలైన విషయం తెలిసిందే. ఆ గ్రూపు కంపెనీల చైర్మన్ గౌతమ్ అదాస్రు ఆస్తులు హరించుకుపోవడంతోపాటు ప్రపంచ సంపన్నుల జాబితాలోనే కాక భారత్‌లో కూడా అత్యంత సంపన్నైడైన వ్యక్తి హోదాను ఆయన కోల్పోయారు. కాగా.. హిండెన్‌బర్గ్ తదుపరి గురి ఎవరిపైనన్న చర్చ సర్వత్రా సాగుతోంది. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ తాజాగా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో త్వరలోనే మరో భారీ నివేదికను బయటపెట్టనున్నట్లు వెల్లడించింది.

2022 డిసెంబర్ 13న గౌతనీ అదానీ నికర ఆస్తుల విలువ 124.2 బిలియన్ డాలర్లు ఉండగా ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన అనంతరం అదానీ గ్రూపు ఆస్తుల విలువ 50.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. నివేదిక వెలువడిన అనంతరం అదానీ గ్రూపు నుంచి పెద్దమొత్తంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహంచకోవడంతో గ్రూపు కంపెనీలు తీవ్ర నష్టాల పాలయ్యాయి. హిండెన్‌బర్గ్ నివేదికకు స్పందనగా అదానీ గ్రూపు 400 పేజీలతో కూడిన నివేదికను విడుదల చేసి ప్రతి ఆరోపణకు వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఇన్వెస్టర్లలో మాత్రం అది భరోసా నింపలేకపోయింది. త్వరలో విడుదల కానున్న హిండెన్‌బర్గ్ తాజా నివేదిక ఎవరిపైన గురిపెడుతుందో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News