Monday, December 23, 2024

హిందీ సినీ పాటల రచయిత్రి మాయా గోవింద్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Hindi-film lyricist Maya Govind passed away

ముంబయి: ప్రముఖ సినీ పాటల రచయిత్రి, కవియిత్రి మాయా గోవింద్ గురువారం ఇక్కడి తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. 70వ దశకం ప్రారంభంలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాయా గోవింద్ రాసిన పాటలలో మై ఖిలాడి తూ అనాడి, ఆంఖోం మే బసే హో తుమ్ వంటి పాటలు చాలా ప్రసిద్ధి పొందాయి. వినోద్ ఖన్నా నటించిన ఆరోప్, హేమా మాలిని నటించిన రజియా సుల్తాన్, షారూఖ్ ఖాన్ నటించిన ఛాహత్ చిత్రాలకు ఆమె పాటలు రచించారు. 70వ దశకం నుంచి 90వ దశకం వరకు విస్తృతంగా పాటలు రాసిన ఆమెకు 2000 సంవత్సరం ప్రారంభం నుంచి అవకాశాలు తగ్గాయి. ఆమె చివరిగా 2014లో బజార్ ఇ హుస్న్ అనే చిత్రానికి పాటలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News