Monday, December 23, 2024

ప్రాంతీయ భాషలకు హిందీ పోటీ కాదు: అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

Hindi not competing with regional languages: Amit Shah 

సూరత్: దేశంలో ఉన్న భాషలన్నింటికీ హిందీ పోటీ కాదని, మిత్రభాష అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలకు వ్యతిరేకంగా హిందీని చిత్రీకరించేందుకు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. హిందీని కలుపుకుంటూనే ప్రాంతీయ భాషలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం హిందీ దివస్ పురస్కరించుకుని సూరత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. హిందీగుజరాతీ, హిందీతమిళం, హిందీమరాఠీల మధ్య పోటీ ఉందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, దేశంలో ఏ భాషకూ హిందీ పోటీ కాదని, దేశం లోని భాషలన్నింటికీ ఇది మిత్రబాష అని స్పష్టం చేశారు.

కేవలం హిందీ భాష అభివృద్ధి చెందినప్పుడే దేశం లోని ప్రాంతీయ భాషలన్నీ పరస్పరం వర్ధిల్లుతాయని సూరత్‌లో జరిగిన ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు. భాషలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూనే మనుగడ ఉంటుందని, ఇతర భాషల నుంచి పదాలను కలుపుకుంటూ హిందీ నిఘంటువును మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాన్ని అంగీకరించాలని చెప్పారు. భాషలన్నీ పరస్పరం సహకరించుకుంటే తప్ప మన సొంత భాషలో దేశం నడవాలనే స్వప్నాన్ని సాకారం చేసుకోలేమన్నారు. దేశంలో ఉన్న భాషలు, మాతృభాషలు, మాతృభాషలు సజీవంగా వర్థిల్లాలనేదే మనందరి లక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అమిత్ షా స్పష్టం చేశారు.

Hindi not competing with regional languages: Amit Shah 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News