Wednesday, January 22, 2025

వరంగల్‌లో హిందీ పేపర్ లీక్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఎస్‌ఎస్‌సి హిందీ పేపర్ లీక్ అయింది. ఉదయం 9.30కే హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు సమాచారం. వికారాబాద్ జిల్లాలో విద్యార్థులు పరీక్ష రాస్తుండగానే తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. హిందీ ప్రశ్నాపత్రం బయటకు రావడంతో విద్యార్థులు, అటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎస్‌ఎస్‌సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో రెండో పేపర్ ప్రత్యక్షం అయినట్టు సమాచారం. టెన్త్ పేపర్ లీక్ ఘటనలపై విద్యాశాఖ సీరియస్ అవుతోంది.

వరంగల్‌లో పేపర్ లీక్‌పై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ ఘటనపై డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. వరంగల్ డిఇఒ, ఎంఇఒలపై విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవ సేన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రాథమిక సమాచారంతో చర్యలకు సిద్దమవుతోందని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టెన్త్ పేపర్ సోషల్ మీడియాలో కనిపించడంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. కుట్ర కోణంలో విచారణ జరపాలని పోలీసులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News