Monday, December 23, 2024

కన్నడ రచయితలకు బెదిరింపు లేఖలు: హిందూత్వవాది అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రగతిశీల భావాలుగల మందికిపైగా కన్నడ రచయితలు, ఆలోచనాపరులకు బెదిరింపు లేఖలు రాసిన ఒక హిందూత్వ కార్యకర్తను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. దావణగెరె జిల్లాకు చెందిన శివాజీరావు జాదవ్ అనే హిందూత్వ కార్యకర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) పోలీసులు జాదవ్‌ను దావణగెరె జిల్లాలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

గత రెండేళ్లుగా తమకు బెదిరింపు లేఖలు రాస్తున్న నిందితుడిపై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత రచయితలంతా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలసి డిమాండ్ చేయడంతో పోలీసులు జాదవ్‌ను అరెస్టు చేశారు.

హిందూత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నందుకు రోజులు లెక్కపెట్టుకోవాలని బెదిరిస్తూ ప్రముఖ రచయితలు కె వీరభద్రప్ప, బిఎల్ వేణు, బంజగెరె జయప్రకాష్, బిటి లలితా నాయక్, వసుంధరా భూపతి తదితరులకు జాదవ్ లేఖలు రాసినట్లు పోలీసులు తెలిపారు. ఒకే వ్యక్తి ఈ లేఖలన్నీ రాశాడని, కాని వేర్వేరు ప్రాంతాల నుంచి వీటిని పోస్టు చేశాడని సిసిబికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత రచయితలకు తగిన భద్రతను సమకూర్చాలంటూ పోలీసులను రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర ఆదేశించారు.

హిందూత్వ వ్యతిరేక వైఖరితో ఉన్నందునే తాను ఆయా రచయితలకు బెదిరింపు లేఖలు రాసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు జాదవ్ ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచిన పోలీసులు ప్రశ్నించడం కోసం అతడిని 10 రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు.

కర్నాటక గతంలో జర్నలిస్టు గౌరీ లంకేష్, హక్కుల కార్యకర్త, రచయిత ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి హత్యలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News