- Advertisement -
కరాచి: పాకిస్థాన్‌లో వరద ప్రళయం కొన్ని లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. ఏ దిక్కూలేక అల్లాడుతున్న వరద బాధితులకు చిన్న గ్రామం లోని హిందూ ఆలయం ఆశ్రయం కల్పించి ఆదుకుంది. కచ్చి జిల్లా జలాల్‌ఖాన్ గ్రామం లోని బాబా మధోదాస్ మందిర్ దాదాపు 300 మంది వరద బాధితులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించింది. బాధితుల్లో అధికశాతం ముస్లింలే. ఈ గ్రామం ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాలతో నదుల వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఒంటరిగా మిగిలింది. స్థానిక హిందూ సమాజం బాబా మధోదాస్ మందిర ం తలుపులు తెరిచి బాధితులకు, వారి పాడి పశువులకు రక్షణ కల్పించింది.
- Advertisement -