Monday, December 23, 2024

నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందని అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. సూర్యుడు ఉన్నంత వరకు హిందూత్వం, సనాతన ధర్మం ఉంటుందన్నారు. ఓవైసీ హిందువులను నీవు ఏం చేయలేవని అన్నారు. హిందువులు అంతా జాగృతం అయ్యారని పేర్కొన్నారు. పదేళ్ళ క్రితం అయోధ్యలో రామమందిరం అవుతుందని అనుకోలేదన్నారు. కానీ ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. 370 ఆర్టికల్ పోతుందని ఎవరూ అనుకోలేదన్నారు.

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందన్నారు. తెలంగాణలో రామరాజ్యం రాబోతుందన్నారు. అస్సోంలో రూ. 98లకే పెట్రోల్ వస్తుందని, కానీ తెలంగాణలో రూ.108లకు ఉందన్నారు. అస్సోంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వస్తుందన్నారు. తెలంగాణలో ఒకటవ తేదీన కూడా రాదన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనడానికి వచ్చిన హిందూ టైగర్ అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ సమాజానికి హాని చేసే వాళ్ల కోసం జైలుకెళ్లినని అన్నారు. మీరంతా ఆశీర్వదించండని, తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణం తీసుకురావాలేనన్నారు. కుహానా లౌకిక వాదుల ఆటకట్టించడానికే ఏక్తా యాత్ర అని అన్నారు. మన ఐక్యతను చాటాలనే ఉద్దేశ్యంతోనే సాగుతున్న యాత్ర అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News