దేశంలో మతం హిందూ, ప్రాంతం హిందూస్థాన్, భాష హిందీ. ఈ విధంగా మరొ కసారి హిందూ హిందీ హిందూస్థాన్‌లను మొదటి వరుసలోకి తీసుకు వచ్చే ప్రమాదం ఎక్కువవుతున్న ది. క్రమంగా ఇది దక్షిణాదిని, ఉత్తరాదిని విభజించి, మరింత అనైక్యతను పెంచే పరిస్థితి కనిపిస్తున్న ది. అందువల్ల కేవలం దక్షిణాది ప్రాంతాల ప్రజలే కాకుండా, ఉత్తర భారతదేశంలో ఇప్పటికే హిందూ మతంతో, హిందీ భాషతో అణచివేతకు, వివక్షలకు గురైన అందరూ ఇటువంటి పెత్తందా రి, నిరంకుశ ధోరణులను ప్రతిఘటించాలి. రాజ్యాంగ నిపు ణులు అందించిన స్ఫూర్తితో ప్రజాస్వామ్య, లౌకిక పునాది కలిగిన రాజ్యాంగాన్ని రక్షించు కోవడమే కాకుండా దాని అమలుకోసం ఒక ప్రజాఉద్యమాన్ని నిర్మించాలి.
హిందీ భాష విషయంలో సాగుతున్న వివాదం ఈనాటిది కాదు. గత ఎన్నో ఏళ్లుగా ఈ చర్చ సాగుతున్నది. ఇండి యాలో ఉన్న భాషల్లో చాలా వైవిధ్యము న్నది. ముఖ్యంగా దక్షిణాది భాషలైన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలు ఉత్తరాది భాషలతో ప్రాథమికమై న భేదాలున్నాయి. అందువల్ల దక్షిణాది ప్రాంతాలు హిందీని మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. ముఖ్యంగా తమిళ, కేరళ ప్రజలు హిందీని ఎంత మాత్రం అంగీకరించే స్థితిలో లేరు. అయితే భారతీయ జనతా పార్టీ నాయ కత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ చర్చ మరింత బలాన్ని పుంజుకున్నది. నిజానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాషలను చూసిన, రాష్ట్రాలను చూసిన హిందీ ప్రాధాన్యత తక్కువ.
ఇతర రాష్ట్రాలకు చెందిన నా ప్రియమైన, సోదరి, సోదరులారా!.. ఇప్పటి వరకు ఎన్ని ఇతర భాషలను హిందీ మింగేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భోజ్‌పురి, మైథిలి, అవధి, బ్రజ్, బుందేలి, గద్వాలి, కుమౌని, మఘి, మార్వారి, మాల్వి, చత్తేస్‌గఢి, సంతాలి, అంగిక, హో, ఖైరా, ఖుర్తా, కుర్మాలి, కురుఖ్, ముండాలిలతో పాటు ఇంకా అనేక స్థానిక భాషలు మాయమైపోయాయి” ఇది తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హిందీ భాషపైన నిర్మొహమాటమైన విమర్శలు చేశారు. హిందీ భాష విషయంలో సాగుతున్న వివాదం ఈనాటిది కాదు. గత ఎన్నో ఏళ్లుగా ఈ చర్చ సాగుతున్నది. ఇండియాలో ఉన్న భాషల్లో చాలా వైవిధ్యమున్నది. ముఖ్యంగా దక్షిణాది భాషలైన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలు ఉత్తరాది భాషలతో ప్రాథమికమైన భేదాలున్నాయి. అందువల్ల దక్షిణాది ప్రాంతాలు హిందీని మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. ముఖ్యంగా తమిళ, కేరళ ప్రజలు హిందీని ఎంతమాత్రం అంగీకరించే స్థితిలో లేరు.
అయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ చర్చ మరింత బలాన్ని పుంజుకున్నది. నిజానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాషలను చూసిన, రాష్ట్రాలను చూసిన హిందీ ప్రాధాన్యత తక్కువ. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మినహా అన్ని రాష్ట్రాలకు తమ ప్రాంతీయ భాషలున్నాయి. అంటే కేవలం మూడు రాష్ట్రాల భాష దేశం మొత్తం మీద రుద్దాలని చూస్తున్నారు. అయితే అదే స్థాయిలో ప్రతిఘటన కూడా సాగుతున్నది.
స్వాతంత్య్రోద్యమ కాలంలో హిందీ భాష ఒక సాధనంగా వాడారు. ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఇంగ్లీషు వ్యతిరేకత ఒక అంశంగా ఉన్న మాట వాస్తవం. కానీ అనేక మంది స్వాతంత్య్రోద్యమ నాయకులు బ్రిటన్‌లోనో, అమెరికాలోనో చదువులు సాగించి వచ్చిన వాళ్లే. అందరూ ఇంగ్లీషు భాషను తమ జ్ఞాన సముపార్జనకు సాధనంగా వాడిన వాళ్లే. అయితే భారతదేశంలో భాష వైవిధ్యం చాలా ఎక్కువ. మైలు మైలుకు నీటి రుచి మారిపోయినట్టే, ఈ దేశంలో భాషలు మారిపోతాయని సామెత. అంటే అన్ని భాషలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల జరిపిన సర్వేలో 19,500 భాషలు ఉన్నట్టు తేలింది. అదే విధంగా రాజ్యాంగంలో 22 భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. అందులో హిందీ ప్రధానమైన భాషగా పేర్కొన్నారు. అదే విధంగా ప్రాచీన భాషలుగా అస్సామి, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠి, ఒడియా, పాళి, ప్రాకృతం, సంస్కృతం, తమిళం, తెలుగును గుర్తించారు. ఇందులో హిందీ లేకపోవడం గమనించాలి. హిందీ సంస్కృతం నుంచి ఆవిర్భవించినప్పటికీ, తదనంతరం పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు భాషల నుంచి, ఇతర భారతీయ భాషల నుంచి వృద్ధి పొందింది.
1958 నుంచి మాత్రమే హిందీ వ్యాకరణాన్ని స్థిరపరిచినట్టు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇటీవల బయటపడిన పురాతత్వ పరిశోధనల్లో తమిళ భాషకు, తమిళ దేశానికి హరప్పా, మొహంజదారో నాగరికతకు సంబంధాలున్నట్టు భావిస్తున్నారు. అందువల్ల కూడా తమ పురాతన భాషను వదులుకొని ఇటీవల వచ్చిన హిందీ భాషను అనుకరించడం సరికాదని తమిళుల అభిప్రాయంగా కనపడుతున్నది. అంతేకాకుండా చట్టబద్ధమైన విషయానికొస్తే భారత రాజ్యాంగ సభ చర్చలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భారత రాజ్యాంగ రూపకల్పన కోసం ఏర్పాటైన రాజ్యాంగ సభలో దాదాపు రెండు రోజుల పాటు విస్తృతమైన చర్చ జరిగంది. ఈ చర్చలో హిందీ, హిందీయేతర సభ్యులుగా, హిందూ ముస్లిం మతానికి చెందిన సభ్యులుగా చీలిపోయారు.
అంతేకాకుండా పంజాబీలు, బెంగాళీలు, మరాఠీలు కూడా హిందీ భాషను వ్యతిరేకించారు. ప్రథమంగా భాష విషయాల మీద ఏర్పాటైన ఉప సంఘం ‘హిందూస్థాని’ భాషను జాతీయ భాషగా గుర్తించాలని 1947లో నిర్ణయించింది. అయితే భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోవడం అనివార్యమైపోయిన తర్వాత మళ్లీ చర్చ మొదటికొచ్చింది. ఆ తర్వాత 1949 సెప్టెంబర్ 13న రాజ్యాంగ సభలో భాష విషయం మీద చర్చ ప్రారంభమైంది. యునైటెడ్ ప్రావిన్స్ నుంచి ఎన్నికైన ఆర్.వి. దులేకర్ హిందీని జాతీయ భాషగా గుర్తించాలని చర్చను ప్రారంభించారు. ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది సభ్యులు మాట్లాడారు. దులేకర్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ కూడా తమ వాదనలను వినిపించారు. ఆ రోజు కూడా మద్రాసు ప్రెసిడెన్సి ఎన్నికైన సభ్యులు చాలా తీవ్రంగా హిందీని వ్యతిరేకించారు. మద్రాసు ప్రెసిడెన్సి ఎన్నికైన టి.టి. కృష్ణమాచారి “హిందీ భాషను మొత్తం దేశం మీద రుద్దడం భాష సామ్రాజ్యవాదం” గా అభివర్ణించారు. ఇది భవిష్యత్‌లో మరిన్ని వేర్పాటు ఉద్యమాలకు ఊతమివ్వగలదని కూడా హెచ్చరించారు. మునిస్వామి పిళ్లై తదితరులు చాలా తీవ్రంగా హిందీని జాతీయ భాషగా ఉండడానికి వ్యతిరేకించారు.
అంతిమంగా దీని మీద రాజ్యాంగ సభలో ఓటింగ్ జరిగింది. హాజరైన సభ్యులలో 7878 ఓట్లతో రాజ్యాంగ సభ రెండుగా చీలింది. అయితే ఓటింగ్‌ను మళ్లీ జరపాలని నిర్ణయించారు. మరుసటి రోజు ఓటింగ్ రోజు హాజరుకాని కవి, రాజ్యాంగ సభ్యుడు గురు ముఖ్‌సింగ్‌ను పిలిపించారు. ఆయన అనుకూలంగా ఓటు వేయడంతో హిందీ ఒక ఓటుతో నెగ్గింది. అయితే ఈ వివాదం అంతటితో సమసిపోలేదు. మళ్లీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో హిందీని అన్ని రాష్ట్రాల్లో అధికార భాషగా అమలు చేయాలని ప్రతిపాదన వచ్చింది. దానిని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై తీవ్రంగా ప్రతిఘటించారు. 1965 లో దాదాపు 55 రోజులు హిందీ వ్యతిరేక ఆందోళన కొనసాగింది. ఫిబ్రవరి 10, 1965 న 35 మంది ఆందోళనకారులు పోలీసు కాల్పులలో మరణించారు. 1967 68 కూడా అధికార భాష సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమిళనాడులో ఉద్యమం సాగింది. ఈ నేపథ్యంలోనే 1968లో ప్రపంచ తమిళ సభలు జరిగాయి.
తెలుగు, కన్నడ ప్రాంతాల్లో, మలయాళ రాష్ట్రంలో కూడా హిందీ భాషపట్ల అనుకూలత లేదు. ఇటీవల కర్నాటకలో చాలా చోట్ల కన్నడ భాష ఉద్యమాలు జరిగాయి.
కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హిందీ భాషను రుద్దడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ హిందీని జాతీయ భాషగా అధికార భాషగా చేయడంలో వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అంతేకాకుండా, దక్షిణ, ఉత్తర భారత ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా అభివర్ణించారు. ఆయన ప్రతిసారి దక్షిణ భారత దేశం పట్ల సుహృద్భావంతో ఉన్నారు. ఇటీవల మరొక పెను ప్రమాదం దక్షిణ భారతదేశం ఎదుర్కోబోతున్నది. జనాభా ప్రాతిపదికగా లోక్‌సభ స్థానాలను నూతనంగా డీలిమిటేషన్ చేయబోతున్నారు. దీనితో ఉత్తర భారత దేశంలో సీట్లు గణనీయంగా పెరుగుతాయి. దక్షిణ భారతదేశంలో తగ్గుతాయి. ఇది దక్షిణ భారత దేశ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీయగలదు. ఇది బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నది. దీనితో పాటు హిందూ మతాన్ని దాదాపు అధికార మతంగా చూస్తున్నది. రాజ్యాంగంలో లౌకిక తాత్వికత, విధానాలు ఉన్న ఊరికే అవి కాగితాల వరకే పరిమితమైనట్టు కనిపిస్తున్నది.
దేశంలో మతం హిందూ మతం, ప్రాంతం హిందూస్థాన్, భాష హిందీ. ఈ విధంగా మరొకసారి హిందూ హిందీ హిందూస్థాన్‌లను మొదటి వరుసలోకి తీసుకు వచ్చే ప్రమాదం ఎక్కువవుతున్నది. క్రమంగా ఇది దక్షిణాదిని, ఉత్తరాదిని విభజించి, మరింత అనైక్యతను పెంచే పరిస్థితి కనిపిస్తున్నది. అందువల్ల కేవలం దక్షిణాది ప్రాంతాల ప్రజలే కాకుండా, ఉత్తర భారతదేశంలో ఇప్పటికే హిందూ మతంతో, హిందీ భాషతో అణచివేతకు, వివక్షలకు గురైన అందరూ ఇటువంటి పెత్తందారి, నిరంకుశ ధోరణులను ప్రతిఘటించాలి. రాజ్యాంగ నిపుణులు అందించిన స్ఫూర్తితో ప్రజాస్వామ్య, లౌకిక పునాది కలిగిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే కాకుండా దాని అమలుకోసం ఒక ప్రజాఉద్యమాన్ని నిర్మించాలి.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం