Sunday, December 22, 2024

ముస్లింల దుకాణాల మూసివేతను అడ్డుకున్న హిందూ వ్యక్తి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: మనోన్మాదశక్తులు ఎంత చెలరేగిపోతున్నప్పటికీ భారతదేశంలో మతసామరస్యం ఇంకా పరిఢవిల్లుతోందనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఉత్తరాఖండ్‌లోని కమలువాగంజ్‌లో ముస్లింలు నడుపుకుంటున్న దుకాణాలను మూయించేందుకు ప్రయత్నించిన హిందూత్వవాద కార్యకర్తలను ఆ దుకాణాల స్థల యజమాని అయిన హిందూ వ్యక్తి అడ్డుకున్న తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

తన దుకాణాలు నడుపుతున్న ముస్లింలకు అండగా ఆ హిందూ భూస్వంతదారు నిలబడడమే కాకుండా వారి తరఫున తాను పూచీకత్తు తీసుకుంటున్నానని చెప్పారు. ముస్లింలు మరుసటి రోజుకల్లా దుకాణాలు ఖాళీ చేయాలని హిందూత్వ కార్యకర్తలు హెచ్చరికలను సైతం ఆ యజమాని లెక్కచేయలేదు. తన దుకాణాలు నడుపుతున్న వారి కోసం రేపు కూడా వాటిని తెరుస్తానంటూ ఆయన వారికి సవాలు విసిరారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లాకు చెందిన పౌరోలా పట్టణంలో మత ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం విశేషం. ముస్లింలకు అండగా తానున్నానంటూ ముందుకు వచ్చిన ఆ హిందూ స్థలయజమానికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News