Saturday, December 21, 2024

నవరాత్రుల ముసుగులో జాతిపితకు చేసిన పరాభవాన్నిముక్తకంఠంతో ఖండించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: దేవీ నవరాత్రులు దేశంలోనే అత్యాద్భుతంగా సాగే కోల్ కతా లోని రూభి క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహంలో మహిషాసుని స్థానంలో మహాత్ముడి పోలిన బొమ్మను ఏర్పాటు చేయడాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. దేశంలో వున్న 16 కోట్ల మంది వైశ్యా జాతి మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిచాలని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల మేరకే ఈ సంస్థలు అలా చేస్తున్నాయని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గాంధీని చంపిన గాడ్సేకే బిజెపి మద్దతుగా మాట్లాడడం మనకు తెలిసిందేనని, ఆహింస మార్గంలో అవిశ్రాంత పోరాటాల ద్వారా దేశానికి స్వాతత్య్రం తీసుకొచ్చిన గాంధీజీని అవమానపర్చిన అఖిల భారత హిందూ మహాసభ ను వెంటనే రద్దు చేసి, ఆ సంస్థ నిర్వాహుకులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. జాతి పితను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని, బీజేపీ చేస్తున్న ఈ అరాచక పనులను దేశం మొత్తం గమనిస్తోందని వారికి త్వరలో తగిన గుణ పాఠం చెబుతారన్నారు. దేవుని విగ్రహాల వద్ద ఇలా మహాత్మా గాంధీ ని కించపరిచే విధంగా ప్రతిమను ఏర్పాటు చేసి బీజేపీ అనుబంధ సంస్థలు చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఈ అరాచకాలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయాల్సిందిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News