- Advertisement -
సింద్ ప్రాంతంలో ఘటన ..ఉద్రిక్తత
లాహోర్ : పాకిస్థాన్‌లో నిరసన ప్రదర్శనల దశలోనే ఓ హిందూ మంత్రిపై అల్లరిమూకలు దాడి జరిపాయి. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని సింధులో ఇరిగేషన్ క్రాలువ పనుల విషయంలో నిరసనలు చెలరేగాయి. మత వ్యవహారాల సహాయ మంత్రి అయిన కియాల్ దాస్ కొహిస్థానీ ఈ ప్రాంతంలో ఉండగా నిరసనకారులు ఆయనను గుర్తించి, ఆయనపై టొమాటలు , ఆలుగడ్డలతో దాడికి దిగారు. దీనితో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి తమ కాన్వాయ్‌తో ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగానే నిరసనకారులు ఆయనను టార్గెట్ చేసుకున్నారని వార్తా సంస్థలు తెలిపాయి. సింధ్ లోని థట్టా జిల్లాలో జరిగిన ఘటనలో ఆయన ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకోగలిగారు. మంత్రివర్గ సహచరుడిపై దాడిని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని, దుండగులను శిక్షిస్తామని తెలిపారు.
- Advertisement -