Friday, November 22, 2024

హిందూ-ముస్లిం చిచ్చుకు సావర్కరే కారణం: నానా పటోలె

- Advertisement -
- Advertisement -

 

నాగపూర్(మహారాష్ట్ర): హిందువులు, ముస్లిముల మధ్య వివాదాన్ని మొదలుపెట్టింది వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్)అని ఆరోపిస్తూ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నానా పటోలె కొత్త వివాదానికి తెరతీశారు. వీర్ సావర్కర్ ప్రతిపాదించిన ద్విజాతీయవాద సిద్ధాంతం దేశ విభజనకు దారితీసిందని, దేశంలో ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించిందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

సావర్కర్ సృష్టించిన వాతావరణం కారణంగానే మహాత్మా గాంధీ హత్య జరిగిందన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి ప్రకటనను పటోలె గుర్తు చేశారు. సావర్కర్‌పై కాంగ్రెస్‌అభిప్రాయం మొదటి నుంచి ఒకేరకంగా ఉందని, కాని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అభిప్రాయంతో విభేదాలు ఉన్నాయని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఏ మతాన్ని కాని వ్యక్తులను కాని ద్వేషిందని, అన్నిమతాలను సమానంగా గౌరవించాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బిజెపి కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం), ఎన్‌సిపితో కలసి పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు బిజెపి, మోడీ ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవని, అందుకే అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి సావర్కర్ వంటి అంశాలను తెరపైకి తెస్తున్నాయని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News