Wednesday, January 22, 2025

‘ఆదిపురుష్’ నిర్మాతలు, నటీనటులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హిందూ సేన

- Advertisement -
- Advertisement -

Aadipurush

న్యూఢిల్లీ: ‘ఆదిపురుష్‌’ చిత్ర నిర్మాతలు, నటీనటులపై ‘హిందూ సేన’ అనే సంస్థ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు, ఇతర పాత్రలకు సంబంధించిన ‘అభ్యంతరకరమైన కంటెంట్’లను తొలగించాలని కోరుతూ  ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) వేసింది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ను సమర్పించారు. మతపరమైన ఆదర్శ వ్యక్తులను అనుచిత రీతిలో చిత్రీకరించడం ద్వారా ఈ చిత్రం హిందూ సమాజం  మనోభావాలను దెబ్బతీసిందని పిటిషన్‌లో పేర్కొంది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ముందు హిందూ సేన ప్రాతినిధ్యం వహించిందని, అయితే ఎలాంటి స్పందన రాలేదని పిటిషన్‌లో పేర్కొంది. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన పోషించిన రావణుడి పాత్ర,  ఇంకా సినిమాలో
హనుమంతుడి పాత్ర   భారతీయ నాగరికతకు  పూర్తిగా భిన్నంగా ఉందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News