Sunday, December 22, 2024

ఆదిపురుష్ నిలిపివేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారీ అంచనాలతో విడుదలయిన ఆదిపురుష్ సినిమా రామాయణాన్ని అవహేళన చేస్తున్నట్లుగా ఉందని, ప్రదర్శనను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో క్రవారం పిటిషన్ దాఖలు అయింది. తమ పిటిషన్ ప్రజల మనోభావాలు, మతవిశ్వాసాలు మొత్తం మీద ప్రజాహితానికి సంబంధించినదని పేర్కొంటూ హిందూసేన జాతీయ అధ్యక్షులు విష్ణుగుప్తా ఈ పిటిషన్ వేశారు.

ప్రత్యేకించి శ్రీరాముడిని కించపర్చే విధంగా ఈ సినిమాను రూపొందించారని, దీనిని దేశంలో నిషేధించాలని, ఇప్పటికే నేపాల్‌లో ఈ సినిమా విడుదలను నిలిపివేశారని పిటిషనర్ తెలిపారు. ఆదికవులు సృష్టించిన స్వచ్ఛమైన రామాయణ ఇతివృత్తం వక్రీకరణ ప్రత్యేకించి ప్రధాన పాత్రలను మలిచిన తీరు గేలిచేసేవిధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News