Wednesday, January 22, 2025

జెఎన్‌యూవద్ద హిందూ సేన పోస్టర్లు

- Advertisement -
- Advertisement -

Hindu Sena posters at JNU

న్యూఢిల్లీ : స్థానిక జెఎన్‌యూ వద్ద హిందూ సేన పేరిట పోస్టర్లు వెలిశాయి. కాషాయ జెండాలు రెపరెపలాడుతూ కన్పించాయి. జెఎన్‌యూ క్యాంపస్‌లో శ్రీరామనవమి నాడే విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగడం ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూసేన రాతలతో పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. కాషాయానికి ఎటువంటి అవమానం జరిగినా కఠిన చర్యలు తప్పవని, దీనిని వ్యతిరేక శక్తులు గమనించాలని బ్యానర్లపై రాసి ఉంచారు. క్యాంపస్‌లో తరచూ హిందూ వాదానికి అవమానాలు జరుగుతున్నాయి. ఇకనైనా ఈ దుశ్చర్యలను మానుకోండి లేకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని సేన జాతీయ స్థాయి ఉపాధ్యక్షులు సుర్జిత్ సింగ్ యాదవ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News