Monday, December 23, 2024

బక్రీద్… కొత్త నిర్ణయం తీసుకున్న హిందూ సంఘాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బక్రీద్ పండుగ రోజు హిందూ సంఘాలు కొత్త నిర్ణయం తీసుకున్నాయి. గోవధ కోసం అమ్మకాలు జరుపుతున్న గోవులను హిందువులు కొన్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో 15 ఎద్దులు, 2 అవులను బెజెపి నాయకుడు గణేష్ యాదవ్ బృందం కొనుగోలు చేసింది. తలబ్ కట్ట, బహుదూర్ పుర, భవాని నగర్ ప్రాంతంలో తిరిగి గోవులను హిందూ సంఘాలు కొన్నాయి. ఒక్కొక్క గోవుకు రూ. 35,000 పెట్టి కొన్నారు. గోవుల విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు తలెత్తకుండా హిందూ సంఘాలు వినూత్న ఆలోచన చేశాయి. ప్రతి హిందువు కబేళాలకు గోవులు వెళ్లకుండా కాపాడుకోవాలి అంటూ గణేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News