- Advertisement -
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. చినోహిల్స్‌లో ఉన్న బాప్స్ శ్రీ స్వామి నారాయణన్ ఆలయం గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా పెయింట్‌తో రాతలు రాశారు. ఈ ఘటనను భారత సర్కార్ తీవ్రంగా ఖండించింది. దీనికి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీని కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ పత్రినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది చాలా హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని.. అలాగే ప్రార్థన స్థలాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -