Wednesday, January 22, 2025

కెనడాలో హిందూ ఆలయం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

Hindu temple vandalized in Canada

స్థానిక ఖలీస్థానీ శక్తుల చర్య..తీవ్ర నిరసనలు

టొరంటో : కెనడాలో ప్రఖ్యాత స్వామి నారాయణ్ హిందూదేవాలయాన్ని కెనడా ఖలీస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేసి ధ్వంసం చేశారు. భారత వ్యతిరేక ధోరణితో జరిగిన ఈ ఘటన పూర్తిగా విద్వేషపూరిత నేరచర్యగా ఖండనలు వెలువడ్డాయి. టొరంటోలో జరిగిన ఘటనను కెనడాలోని భారత దౌత్యకార్యాలయ వర్గాలు తీవ్రంగా గర్హించాయి. ఈ చర్యకు పాల్పడ్డవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను దౌత్యాధికారులు కోరారు. టొరంటోలోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్‌పై ఎప్పుడు దాడి జరిగిందనేది నిర్థిష్టంగా తెలియలేదు. అయితే ఈ ఘటనపై భారత హైకమిషన్ ట్వీటు వెలువరించింది. ఈ అంశంపై స్థానిక ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపింది. మరో వైపు కెనడా పార్లమెంట్ సభ్యులు చంద్ర ఆర్య ఈ ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టొరంటో ఆలయంలో ఖలీస్థానీయులు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఇటీవలి కాలంలో కెనడాలోని హిందూ ఆలయాలపై ఇటువంటి ద్వేషపూరిత చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది హిందూ సామాజిక వర్గంలో ఆందోళనకు దారితీస్తోందని తెలిపారు.

హిందూ కెనెడియన్లు చట్టపరంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని వీటిని గుర్తించి తగు విధంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. బ్రాంప్టన్ సౌత్ ఎంపి సోనియా సిద్ధూ ఈ ఘటనపై స్పందిస్తూ అక్కడ జరిగిన విధ్వంసకాండ తనకు బాధను కల్గించిందని, బహుళ సంస్కృతులు, భిన్నమత విశ్వాసాల సమాజంలో నివసిస్తున్న మనలోని ప్రతి ఒక్కరికి భద్రతాయుతమైన వాతావరణం ఉండాలి. స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగి దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి తగు పరిణామాలు అనుభవించేలా చూడాల్సి ఉందని ఆమె కోరారు. బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థాన్ ఓ ఆధ్యాత్మిక, కార్యకర్తల నిర్వహణతో కూడిన సంస్థ. విశ్వాసం, ఐక్యత, నిస్వార్థ సేవలతో కూడిన హిందూ ఆదర్శాలను పెంపొందింపచేయడం ద్వారా వ్యక్తిగత సమున్నతిని సాధించి సమాజాన్ని మెరుగుపర్చేందుకు యత్నిస్తోందని , ఇక్కడ జరిగిన దాడి సమాజంలపై దాడిగా భావించాల్సి ఉంటుందని ఈ మహిళా ఎంపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News