Monday, December 23, 2024

పాక్‌లో హిందూ మహిళ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

పాక్‌లో హిందూ మహిళ దారుణ హత్య
తలనరికి, చర్మం వొలిచి, మెదడు తొలిచిన ఘటన
వివరాలను తెలిపిన హిందూ ఎంపి కృష్ణకుమారి
ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన భారత్
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఓ హిందూ మహిళను సింజ్హోరో పట్టణంలో అత్యంత దారుణంగా, పైశాచికంగా హతమార్చారు. తలనరికివేసి, మెదడులోని భాగాలను వెలికితీసి, చిత్రవధకు గురి చేసి బుధవారం ఈ 40 ఏండ్ల మహిళను అంతమొందించారు. పాకిస్థాన్‌లోని సింజ్హోరో పట్టణంలో హత్యకు గురయిన మహిళ వివరాలను గురించి పాకిస్థాన్‌కు చెందిన మైనార్టీ ఎంపి కృష్ణకుమారి తమ ట్వీటులో తెలిపారు. ఈ మహిళను తలనరికివేశారని, వక్షోజాలను కోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దయా ఓ వితంతువు. ఆమె భౌతికకాయం పూర్తిగా దెబ్బతిని ఉండగా గుర్తించారు. తల శరీరం నుంచి వేరయింది. మెదడు నుజ్జునుజ్జయింది. తాను ఘటనాస్థలికి వెళ్లి చూసి వచ్చానని ఈ ఎంపి తెలిపారు.

ఆమెను చంపివేసిన తరువాత హంతకులు చివరికి ఆమె వంటిపై చర్మాన్ని కూడా వొలుచుకుని పోయినట్లు, కేవలం ఎముకల గూడు, తల సమీపంలోని గోధుమ పొలంలో పడేసి వెళ్లినట్లు తెలిసింది. వివరాలను తెలియచేసిన ఎంపి కృష్ణకుమారి పాకిస్థాన్‌లో హిందూ సమాజం నుంచి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సభ్యురాలు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతగా ఉన్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ అధికార యంత్రాంగం దేశంలోని మైనార్టీల రక్షణ భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, వీరిని దేశవాసులుగా గుర్తించి వారి పట్ల శ్రద్ధ తీసుకోవల్సి ఉందని మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఈ మహిళ ఘటన గురించి తమ వద్ద పూర్తి స్థాయి సమాచారం లేదని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News