- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్(సిఎస్‌ఎస్) పరీక్షలో మొట్టమొదటిసారి ఒక హిందూ మహిళ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(పిఎఎస్)కు ఎన్నికయ్యారు. హిందూ జనాభా అత్యధికంగా నివసించే పాక్‌లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన షికర్‌పూర్ జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన సనా రమాచంద్ ఎంబిబిఎస్ డాక్టర్. సిఎస్‌ఎస్ పరీక్షలో భాగంగా లిఖితపూర్వక పరీక్షకు మొత్తం 18,553 మంది హాజరుకాగా ఉత్తీర్ణులైన 221 మంది అభ్యర్థులలో రమాచంద్ ఒకరు. అనంతరం మెడికల్, సైకలాజికల్, మౌఖిక పరీక్షల అనంతరం విజేతల తుది జాబితాలో ఆమె కూడా చోటు దక్కించుకున్నారు. పిఎఎస్‌కు ఎంపికైన వారు తొలుత జిల్లా అసిస్టెంట్ కమిషనర్లుగా నియమితులవుతారు. అనంతరం జిల్లా కమిషనర్లుగా(భారత్‌లో జిల్లా కలెక్టర్లకు సమాన హోదా) నియమితులవుతారు.
- Advertisement -